నీటి భద్రత కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించాలని చంద్రబాబు స్పష్టీకరణ
రిపోర్టర్: హరి
స్థలం: Andhra Pradesh
వివిధ రంగాలకు నీటి భద్రతే లక్ష్యంగా సమగ్ర నీటి ప్రణాళిక రూపొందించాలని, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిలో ఎక్కడా రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినట్లు CMO ఆంధ్రప్రదేశ్ వెల్లడించింది. క్యాంప్ కార్యాలయంలో నేడు జలవనరుల శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి అవసరమైన నీటి వనరుల సమర్థ నిర్వహణ, ప్రాజెక్టుల వేగవంతమైన పూర్తిపై అధికారులతో చర్చించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు.