మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదన్న సీఐ గఫూర్
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టౌన్ సీఐ గఫూర్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. మద్యం తాగి వాహనం నడిపిన నలుగురు వ్యక్తులకు స్థానిక కోర్టు జైలు శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధించిందని తెలిపారు. ప్రజలు మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆయన తీవ్రంగా విజ్ఞప్తి చేశారు.