సచివారంలో ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: నల్గొండ
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రహదారుల పనులు, హామ్ రోడ్లు, ఉస్మానియా, నిమ్స్ విస్తరణ, నూతన హైకోర్టు భవన నిర్మాణాల పురోగతిని ఆయన పరిశీలించారు. ఆల్వాల్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.