వరంగల్ పోలీస్ స్టేషన్లలో అమరవీరుల సంస్మరణపై వెల్లువెత్తిన విమర్శలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వరంగల్

వరంగల్ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని స్టేషన్లలో కనీసం అమరవీరుల స్మారక బ్యానర్లు కూడా ఏర్పాటు చేయకపోవడంపై సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అధికారులు విధులకు సరిగా హాజరుకాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.