హ్యూస్టన్లో వైభవంగా విశ్వ వేద పారాయణ బృంద వార్షికోత్సవం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Houston
అమెరికాలోని హ్యూస్టన్లో విశ్వ వేద పారాయణ బృందం ఎనిమిదో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ శృంగేరి విద్యా భారతి ఫౌండేషన్ వేదికగా జరిగిన ఈ వేడుకకు సుమారు ఐదు వందల మంది భక్తులు తరలివచ్చారు. సనాతన ధర్మ పరిరక్షణ ధ్యేయంగా సాగుతున్న ఈ సంస్థ సేవలను డాక్టర్ రఘు శర్మ చుండూరు వివరించగా, పలువురు ప్రముఖులకు ఘన సన్మానం నిర్వహించారు.