ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు తీవ్ర వాయుగుండం ప్రభావంతో రెడ్ అలర్ట్
రిపోర్టర్: విజయ్
స్థలం: ఆంధ్రప్రదేశ్
మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తర, మధ్య కోస్తాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది. సముద్రం అలజడిగా మారనుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.