ఇందుకూరుపేట మండలంలో విషాదం: మద్యం మందలించిందని భర్త ఆత్మహత్య
రిపోర్టర్: కిరణ్
స్థలం: నెల్లూరు
మద్యం సేవించి వస్తున్నాడంటూ భార్య మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీపట్టి నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొమరిక గ్రామంలో శుక్రవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కొమరికకు చెందిన మందా నరేశ్ తాగుడుకు బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో భార్య రాజేశ్వరి నిలదీయడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయాడని ఎస్ఐ పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.