జూరాల ఎడమ కాలువకు నీటి విడుదల సాధించిన రైతులు
రిపోర్టర్: నరేష్
స్థలం: పాలమూరు
పాలమూరులో రైతుల పోరాటం ఫలించింది. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి జూరాల ఎడమ కాలువకు నీళ్లు విడుదల చేయించుకున్నారు. పంటలు ఎండిపోతున్నాయని రైతులు చేసిన ఆందోళనలు, బీఆర్ఎస్ ధర్నా పిలుపుతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసింది.