తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో ఘనంగా ప్రపంచ గుండె దినోత్సవం
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లోని తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో ప్రపంచ గుండె దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజా మూర్తి తెలిపారు. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి కారణంగా పెరుగుతున్న గుండె జబ్బులపై రోగులకు అవగాహన కల్పించారు. ప్రతిరోజూ ముప్పై నిమిషాల వ్యాయామం, సమతులాహారం తీసుకోవడం ద్వారా గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చని ఆమె సూచించారు. ముప్పై ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు.