'పీఎఫ్ పరిమితి రూ.25 వేలు': ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
రిపోర్టర్: వెంకట్
స్థలం: New Delhi
దేశంలోని వేలాది మంది ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ తీపి కబురు అందిస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలోకి వచ్చే తప్పనిసరి వేతన పరిమితిని పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రూ.15,000గా ఉన్న పీఎఫ్ వేతన పరిమితిని ఏకంగా రూ.25,000కు పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 51 లక్షల మంది అదనపు ఉద్యోగులకు నేరుగా సామాజిక భద్రతా ప్రయోజనాలు చేకూరనుండగా, తక్షణమే ఇది అమల్లోకి రానుంది.