వైకాపాలో భారీ మార్పులు: నెల్లిమర్ల సమన్వయకర్తగా గదల సన్యాసినాయుడు

రిపోర్టర్: గోపి స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా వైకాపా అధ్యక్షుడిగా మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ను నియమించారు. నెల్లిమర్ల సమన్వయకర్త పదవి నుంచి మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడిని తప్పించారు. ఆయన స్థానంలో జడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.