ఇంటర్ పరీక్షల్ లో బట్టీ విధానానికి స్వస్తి: విద్యార్థులకు కొత్త సంస్కరణల షాక్

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

ఇంటర్మీడియట్ పరీక్షల విధానంలో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్లు ఇంటర్ విద్యా మండలి అధికారులు వెల్లడించారు. విద్యార్థులు గుడ్డిగా బట్టీ పట్టి మార్కులు సాధించే పద్ధతికి స్వస్తి పలకాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ పరఖ్ నిబంధనలకు అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి పబ్లిక్ పరీక్షల్ లో పది శాతం ప్రశ్నలను సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచనను పరీక్షించే విధంగా ఇవ్వనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.