తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నారాయణపేట
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి ఆర్ఐ విజయ్ భాస్కర్ మరియు సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించినట్లు ఎస్పీ నారాయణపేట (SP Narayanpet) వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె ఆత్మగౌరవ పోరాటం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. మహిళల హక్కుల కోసం, పేదల విముక్తి కోసం ఆమె చేసిన పోరాటాలు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని ఈ వేడుకల్లో అధికారులు స్పష్టం చేశారు.