రోడ్డు ప్రమాదాలతో నిరుపేద కుటుంబాల్లో విషాదం: ఆదుకోవాలని బాధితుల ఆవేదన
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నెల్లూరు
రోడ్డు ప్రమాదాలు ఆ నిరుపేద కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయని, దాతలు స్పందించి ఆదుకోవాలని బాధితుల తండ్రి యూసఫ్ మరియు బాధితుడు మల్లికార్జున ఆవేదన వ్యక్తం చేశారు. వేర్వేరు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి, వైద్య ఖర్చులు భరించలేక, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని వారు వాపోయారు. ప్రభుత్వం స్పందించి రుణం ఇప్పిస్తే జీవనం సాగిస్తామని కోరారు.