విద్యుత్ కోతలపై మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ధర్నా

రిపోర్టర్: విజయ్ స్థలం: Kalwakurthy

కల్వకుర్తి నియోజకవర్గంలో విపరీతమైన విద్యుత్ కోతలను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రావిచెడు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.