మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి.. వెదురుకుప్పం మండలం గొల్లపల్లిలో పోలీసుల అవగాహన సదస్సు
రిపోర్టర్: RAVI BABU
స్థలం: వెదురుకుప్పం
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, వెదురుకుప్పం మండలం గొల్లపల్లిలోని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిస్ట్రిక్ట్ ఈగల్ ఇన్స్పెక్టర్ డి. నాగార్జున రెడ్డి, ఈగల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలను వివరించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.