గోదావరిఖనిలో ఘనంగా గణపతి హోమం మరియు అన్నదాన కార్యక్రమం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: గోదావరిఖని

గోదావరిఖనిలోని మెట్రో ఎలైట్ అపార్ట్మెంట్లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గణపతి హోమం, అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ లోకకల్యాణార్థం హోమ ప్రక్రియను శాస్త్రోక్తంగా జరిపించారు. అపార్ట్మెంట్ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమంలో భక్తులకు మహాప్రసాదాన్ని వితరణ చేశారు.