వినోభానగర్‌లో పీఆర్ కమిషనర్‌కు స్వాగతం: అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడిన వైనం
రిపోర్టర్: bhukya Narasimha rao
స్థలం: జులూరుపాడు
భద్రాచలం పర్యటనలో భాగంగా జూలూరుపాడు మండలం వినోభానగర్ వద్ద పంచాయతీరాజ్ కమిషనర్‌కు సర్పంచ్ గంగావత్ నవీన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో అమలవుతున్న పారిశుధ్య పనులు, ఉపాధి హామీ పథకం అమలు తీరును కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.