కడుపు ఉబ్బరం క్యాన్సరే కాకపోవచ్చు కానీ నిర్లక్ష్యం తగదని వైద్యుల హెచ్చరిక

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తెలంగాణ

కడుపు ఉబ్బరం సమస్యను ఎప్పుడూ కేవలం క్యాన్సర్గా భావించవద్దని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. మలబద్ధకం, అజీర్ణం, హార్మోన్ల మార్పుల వల్ల కూడా కడుపు ఉబ్బరం రావచ్చని వైద్యులు తెలిపారు. అయితే పదే పదే వచ్చే పొత్తికడుపు ఉబ్బరంతో పాటు బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు మాత్రం కచ్చితంగా అలర్ట్ అవ్వాలని సూచించారు. ఇలాంటి సమస్యలు తలెత్తితే ఎలాంటి ఇంటి చిట్కాలు ఫాలో కాకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుని అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలని నిపుణులు హెచ్చరించారు.