తెలంగాణలో రైల్వే భద్రత కోసం కవచ్ 4.0 అమలు

రిపోర్టర్: రాము స్థలం: Telangana

తెలంగాణలో రైల్వే భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మల్కాజ్‌గిరి - కామారెడ్డి రైల్వే మార్గంలో మొదటిసారిగా 108 కిలోమీటర్ల మేర కవచ్ 4.0 వ్యవస్థను విజయవంతంగా అమలు చేశారు. ఈ నూతన సాంకేతికతతో రైళ్ల రాకపోకల్లో ప్రమాదాలు జరగకుండా అడ్డుట్ట వేయడంతో పాటు ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.