దేశవాళీ అంపైర్లు మ్యాచ్ రెఫరీల ఫీజులను పెంచనున్న బీసీసీఐ

రిపోర్టర్: సురేష్ స్థలం: ముంబై

రాబోయే 2026-27 దేశవాళీ సీజన్ నుంచి అంపైర్లు, మ్యాచ్ రెఫరీల మ్యాచ్ ఫీజులను పెంచడంతో పాటు గ్రేడేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించింది. ముంబైలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ కీలక సంస్కరణలను వెల్లడించారు. దేశవాళీ అంపైర్లను నాలుగు గ్రేడ్లుగా విభజించి సీనియర్, జూనియర్ టోర్నీలకు కేటాయించనున్నట్లు బోర్డు తెలిపింది.