తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నలభై ఎనిమిదేళ్ల ప్రయాణం పూర్తి

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలో అడుగుపెట్టి నలభై ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ చేశారు. తమ కుటుంబం మరియు ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఆ చారిత్రాత్మక రోజును ప్రతిరోజూ గుర్తుచేసుకుంటామని తెలిపారు. చిరంజీవి చేసిన ప్రయాణానికి, ప్రేక్షకుఇచ్చిన అనూహ్య ప్రేమకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.