ఏపీలో భారీగా పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏకంగా 2050 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఎస్సై విభాగంలో 438, కానిస్టేబుల్ విభాగంలో 1612 పోస్టులు ఉన్నాయి. త్వరలోనే రాత పరీక్ష తేదీలను వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో నిరుద్యోగులలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.