అమరావతిని ప్రపంచమంతా మెచ్చే నగరంగా మారుస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెం వద్ద ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. అమరావతిని ప్రపంచమంతా మెచ్చే నగరంగా మారుస్తామని, రూ.60 వేల కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. రాజధానిలో హెల్త్ కేర్ హబ్, స్పోర్ట్స్ సిటీ, విమానాశ్రయం రానున్నాయని, సాంకేతికతను అందిపుచ్చుకుని రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.