'మేఘాంశ్‌ని అలాగే చూడాలనుకున్నా': ఆస్మాన్ టీజర్ లాంచ్‌లో మంచు మనోజ్
రిపోర్టర్: శివ
స్థలం: Hyderabad
మేఘాంశ్ శ్రీహరి హీరోగా రామ్ నందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆస్మాన్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రా కింగ్ మంచు మనోజ్, శివాత్మిక రాజశేఖర్ పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ శ్రీహరి కుటుంబంతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, మేఘాంశ్ కోరుకున్న విధంగానే టీజర్‌లో అద్భుతంగా కనిపించాడని, ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనసారా ఆకాంక్షించారు.