శ్రీకాళహస్తిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తిలోని ఎస్వీఏ ప్రభుత్వ కళాశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ మన్యం నరసింహులు, గురువులకు భారతీయ సంస్కృతిలో ఉన్నత స్థానం ఉందని కొనియాడారు.

ఉపాధ్యాయ వృత్తిని పవిత్ర బాధ్యతగా భావించాలని ఆయన అధ్యాపకులకు పిలుపునిచ్చారు. విద్యార్థులకు పుస్తక పాఠాలతో పాటు జీవిత పాఠాలను బోధించాలని సూచించారు. ఈ సందర్భంగా అధ్యాపకులను విద్యార్థులు సన్మానించి పాదాభివందనం చేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.