చియాన్ విక్రమ్ ‘పవర్ హౌస్’ టైటిల్ గ్లింప్స్ విడుదల

రిపోర్టర్: రాజేష్ స్థలం: తమిళనాడు

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న 63వ చిత్రానికి ‘పవర్ హౌస్’ టైటిల్‌ను ఖరారు చేశారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. క్యాటరింగ్ వ్యాపారిగా సాధారణ జీవితం గడిపే పాత్రలో విక్రమ్ కనిపిస్తూనే, ఊహించని ట్విస్ట్‌తో సాగే ఈ సస్పెన్స్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రం 2027లో థియేటర్లలో విడుదల కానుంది.