టెక్ ప్రపంచంలో సంచలనం: అక్టోబర్ 29న కొత్త ఫోల్డబుల్ ఫోన్ లాంఛ్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

ప్రముఖ టెక్ దిగ్గజం శామ్సంగ్ సంస్థ త్వరలో చైనా మార్కెట్లో కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ను విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఐటీ హోమ్ వెబ్ సైట్ వెల్లడించింది. అక్టోబర్ 29న నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో శామ్సంగ్ డబ్ల్యూ 27 ఫోల్డబుల్ హ్యాండ్సెట్ను ఆవిష్కరించనున్నట్లు సమాచారం. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా మోడల్ ఆధారంగా అత్యంత ప్రీమియం ఫీచర్లు, ప్రత్యేక డిజైన్తో ఈ సరికొత్త ఫోన్ వస్తున్నట్లు టెక్ నిపుణులు పేర్కొన్నారు.