మార్కెట్లోకి వివో ఎక్స్ 500 స్మార్ట్ ఫోన్ల విడుదల
రిపోర్టర్: భాస్కర్
స్థలం: చైనా
చైనాలో వివో ఎక్స్ 500 సిరీస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్లను వివో సంస్థ విడుదల చేసింది. ఈ లైనప్‌లో వివో ఎక్స్ 500, వివో ఎక్స్ 500 ప్రో, వివో ఎక్స్ 500 ప్రో మాక్స్ మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్లు, శక్తివంతమైన కెమెరా ఫీచర్లు, వివిధ కలర్ ఆప్షన్లతో ఈ ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.