చిల్డ్రన్స్ డే కానుకగా విడుదల కానున్న జయంత్ అండ్ ది జింగో పెన్

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

మాస్టర్ జయంత్ బొలిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన జయంత్ అండ్ ది జింగో పెన్ చిత్రం నవంబర్ 12న విడుదల కానుందని దర్శకుడు నవీన్ దేశబోయిన తెలిపారు. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ ను ఘనంగా ఆవిష్కరించారు. విద్యార్థులు సాధించే మార్కుల కంటే వారి మనసుని ఉపాధ్యాయులు అర్థం చేసుకోవాలనే అద్భుతమైన సందేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు నిర్మాత దివ్యప్రవీణ్ బొలిశెట్టి పేర్కొన్నారు. ఈ చిత్రంలో ఊహారెడ్డి, సత్యం రాజేష్ కీలక పాత్రల్ లో నటించారు.