బైక్ ప్రియులకు గుడ్ న్యూస్: రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750 ఆవిష్కరణ

రిపోర్టర్: గోపి స్థలం: Hyderabad

ద్విచక్ర వాహన ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750 అడ్వెంచర్ బైక్ను కంపెనీ అధికారికంగా ఆవిష్కరించినట్లు వర్గాలు వెల్లడించాయి. రాయల్ ఎన్ఫీల్డ్ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన ట్విన్-సిలిండర్ ఇంజిన్ తో ఈ మోటార్సైకిల్ రానుండటం విశేషం. పూర్తి సాంకేతిక వివరాలను నవంబర్ 3న ప్రారంభం కానున్న ఈఐసీఎంఏ అంతర్జాతీయ మోటార్సైకిల్ ప్రదర్శనలో ప్రకటించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వివిధ రంగులు, వేరియంట్లలో ఈ నూతన బైక్ అందుబాటులోకి రానుంది.