తిరుమలలో వైభవంగా గరుడ వాహన సేవ లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Tirupati
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజైన ఇవాళ ఉదయం మోహిని అవతారంలో దర్శనమిచ్చిన స్వామివారు, రాత్రికి గరుడ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ సేవను వీక్షించేందుకు లక్షలాది సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 19 కళాబృందాల ప్రదర్శనలు ఆధ్యాత్మిక వైభవాన్ని ఇనుమడింపజేశాయి.