ఉద్యోగులు ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచన

రిపోర్టర్: సతీష్ స్థలం: నిర్మల్

ఉద్యోగులంతా విధి నిర్వహణతో పాటు తమ ఆరోగ్య పరిరక్షణకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా స్పష్టం చేశారు. నిర్మల్ కలెక్టరేట్ లో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగుల కోసం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంతో పాటు ఓటరు జాబితా సవరణ పనులను కూడా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.