విద్యార్థులకు అలర్ట్: డిసెంబర్ నెట్ పరీక్ష దరఖాస్తుకు రేపే ఆఖరు
రిపోర్టర్: రాము
స్థలం: న్యూఢిల్లీ
డిసెంబర్ నెట్ పరీక్ష ఆన్ లైన్ దరఖాస్తుల గడువు నవంబర్ ఐదుతో ముగియనుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు స్పష్టం చేశారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. నవంబర్ ఆరు నుంచి తొమ్మిది వరకు అపరాధ రుసుముతో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని అధికారులు తెలిపారు.