నెల్లూరు జిల్లాలో దశాబ్దాలుగా అందని భూ యాజమాన్య హక్కులు

రిపోర్టర్: కిరణ్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా జలదంకి మండలం సోమవరపాడు రెవెన్యూ పరిధిలోని బోయలపాడు, కొత్తపాలెం, సోమవరపాడు గ్రామాల్లో ఈనాం భూముల సమస్య కారణంగా వందలాది మంది రైతులకు దశాబ్దాలుగా పాసుపుస్తకాలు అందడం లేదు. ఎస్టేట్ భూములు, ఈనాం పరిధిలో ఉండటం, కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండటంతో రైతులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పంట రుణాలు పొందలేకపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.