మహిళా సాధికారత దిశగా అడుగులు వేయిస్తున్న కలెక్టర్ శ్రీహర్ష

రిపోర్టర్: SK స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లాలో మహిళలను ఆర్థికంగా, పారిశ్రామికంగా శక్తివంతం చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో మహిళా సాధికారత కేంద్రం పనితీరుపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మహిళలకు ఆర్థిక అంశాలపై విస్తృత అవగాహన కల్పించాలని, ఉపాధి అవకాశాలు పెంపొందించాలని సూచించారు. వీ హబ్ సేవలను మహిళా పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.