యువ ఆవిష్కర్తలతో కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక భేటీ
రిపోర్టర్: అశోక్
స్థలం: గుంటూరు
ఐఎంసీ 2026 సదస్సు సందర్భంగా టెలికాం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హ్యాకాథాన్లో యువ ఆవిష్కర్తలతో సమావేశమైనట్లు కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. తాను స్వయంగా ఒక కంపెనీని నిర్మించిన అనుభవంతో లోతైన పరిశోధన, బలమైన బృంద నిర్మాణం మరియు అత్యుత్తమ ప్రవర్తన ఒక నిజమైన పారిశ్రామికవేత్తను తయారు చేస్తాయని యువతకు ఆయన స్పష్టం చేసినట్లు తెలిపారు.