రోడ్ల నిర్మాణంలో వినూత్న ప్రయోగం: గాజు సీసాలతో తారు రోడ్డు నిర్మాణం

రిపోర్టర్: శివ స్థలం: California

అమెరికాలోని కాలిఫోర్నియాలో వ్యర్థ గాజు సీసాలతో తారు రోడ్డును నిర్మించి పరిశోధకులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారని యూపీఏ నివేదిక వెల్లడించింది. ఫుల్లర్టన్ ప్రాంతంలో పనికిరాని సీసాలను పొడిగా మార్చి, రాతి ధూళితో కలిపి రోడ్డును వేశారు. ట్రాఫిక్ నిరోధకతను పరిశీలించేందుకు నిర్వహించిన ఈ పరీక్ష విజయవంతమైందని, పర్యావరణ పరిరక్షణకు ఈ విధానం ఎంతో దోహదపడుతుందని నిపుణులు స్పష్టం చేశారు.