అమెరికాలో సంచలనం: సుమారు మూడు లక్షల వీసాలు రద్దు చేసిన ట్రంప్

రిపోర్టర్: రమేష్ స్థలం: Washington

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసల నియంత్రణలో భాగంగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత సుమారు మూడు లక్షల వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ వెల్లడించారు. బర్త్ టూరిజం, హింస, ప్రజా భద్రతకు ముప్పు, మద్యం తాగి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన విదేశీ పౌరుల వీసాలను రద్దు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. చరిత్రలో మరే అధ్యక్షుడు చేయని విధంగా కఠిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.