మహాత్మా గాంధీకి ఘన నివాళి: జిల్లా ప్రజలకు ఎస్పీ ప్రత్యేక శుభాకాంక్షలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు ఎస్పీ నితికా పంత్ తెలిపారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించినట్లు చెప్పారు. సత్యం, అహింస, శాంతి, నైతిక విలువలను నిత్యజీవితంలో ఆచరించాలని ఆయన ఆశయాలను భావితరాలకు అందించాలని జిల్లా ప్రజలకు ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.