ముంబై విమానాశ్రయం పునర్నిర్మాణం: నవీ ముంబైకి అంతర్జాతీయ సర్వీసులు తరలింపు
రిపోర్టర్: నరేష్
స్థలం: ముంబై
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ ఒకటి పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో కొన్ని అంతర్జాతీయ సర్వీసులను నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి మార్చాలని విదేశీ విమాన సంస్థలు సిఫారసు చేశాయని వర్గాలు వెల్లడించాయి. అదానీ ఎయిర్ పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ కు పంపిన లేఖలో ఈ అంశాన్ని పేర్కొన్నట్లు పౌర విమానయాన శాఖకు అధికారులు తెలిపారు. ప్రయాణికుల ఇబ్బందులను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.