రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా దసరా ఉత్సవాలు: ఇంద్రకీలాద్రిపై బాలాత్రిపురసుందరీదేవిగా దుర్గమ్మ దర్శనం

రిపోర్టర్: శివ స్థలం: విజయవాడ

రాష్ట్రవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయని ఆలయాల అర్చకులు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై తొలిరోజు దుర్గమ్మ బాలాత్రిపురసుందరీదేవి రూపంలో భక్తులకు కనువిందు చేశారని అధికారులు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించడంతో భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పది రోజుల పాటు జరిగే ఈ వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.