పాములేరు వాగుపై వంతెన కూలిందంటూ పరిశీలించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
రిపోర్టర్: నరేష్
స్థలం: ములకలపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కంపాగూడెంలో పాములేరు వాగుపై కూలిన వంతెనను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించారు. కొత్త వంతెన నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ప్రజలకు ఎలాంటి రాకపోకల ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.