ప్రయాణికులకు తీపి కబురు: ఆర్టీసీ మెట్రో ఉమ్మడి పాస్ ఛార్జీల తగ్గింపుపై కసరత్తు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

సామాన్య ప్రయాణికులపై భారం తగ్గించేలా ఆర్టీసీ మరియు మెట్రో ఉమ్మడి పాస్ ఛార్జీలను హేతుబద్ధీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచనల మేరకు త్వరలోనే రవాణా శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నగరంలో ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు అధికారులు ప్రత్యేక విధివిధానాలు ఖరారు చేస్తున్నారు.