ఈసీ నిర్ణయంపై ఇండియా కూటమి నిప్పులు: జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్
రిపోర్టర్: విజయ్
స్థలం: New Delhi
ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై ఇండియా కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వరకు ఎంపీలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లను పునరుద్ధరించాలని, ఎస్ఐఆర్ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.