ఎన్నికల సంఘం కీలక నిర్ణయం: ఐదు రాష్ట్రాల అధికారుల బదిలీలకు ఆదేశాలు
రిపోర్టర్: విజయ్
స్థలం: న్యూఢిల్లీ
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో పరిపాలనా మరియు పోలీసు అధికారుల బదిలీలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. ఒకే జిల్లాలో మూడేళ్లుగా పనిచేస్తున్న అధికారులను తక్షణమే మార్చాలని, నవంబర్ ముప్పై లోగా ప్రక్రియ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఈసీ ఆదేశించినట్లు వెల్లడైంది.