హిందూ సమాజానికి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్వార్థ రాజకీయాల కోసం హిందూ సమాజాన్ని, విశ్వాసాలను జగన్ అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వినాయక చవితి వేడుకల్లో వైఎస్సార్ విగ్రహంపై పసుపు నీళ్లు పడటాన్ని సాకుగా తీసుకుని వైఎస్సార్సీపీ నేతలు రాజకీయం చేయడం దుర్మార్గమని తెలిపారు. హిందూ సాంప్రదాయాలను కించపరుస్తున్న జగన్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.