ప్రధాని మోదీ ఇరవై ఐదేళ్ల ప్రజా జీవితం దేశానికే గర్వకారణమని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వెల్లడి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: గుంటూరు
సాధారణ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి దేశ ప్రధానిగా మూడు పర్యాయాలు ప్రజల విశ్వాసం పొందడం గొప్ప విషయమని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలై ఇరవై ఐదు సంవత్సరాల ప్రజా జీవితంలో నరేంద్ర మోదీ నిర్ణయాత్మక నాయకత్వంతో ప్రత్యేక ముద్రవేశారని ఆయన వెల్లడించారు. పేదలు, రైతులు, మహిళలు, యువత, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతి కోసం మోదీ ఎంతో కృషి చేశారని గుంటూరు ప్రాంత నేతలు ప్రశంసించారు.