నా మాటలను సరిగ్గా వ్యక్తపరచలేకపోతున్నా: నటి సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

మనసులో ఉన్న భావాలను మాటల రూపంలో ఇతరులకు స్పష్టంగా వ్యక్తపరచలేకపోతున్నానని ప్రముఖ కథానాయిక సాయిపల్లవి తెలిపారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, తన ఆలోచనలను చెప్పడంలో కొంత ఇబ్బంది ఎదురవుతోందని అంగీకరించారు. తాను చెప్పాలనుకున్న విషయానికి భిన్నమైన అర్థాలు వస్తున్నాయని, అందుకే మాట్లాడే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సాయిపల్లవి స్పష్టం చేశారు.