వచ్చే వారం బ్యాంకులకు నాలుగు రోజులు పాటు భారీ సెలవులు

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

బ్యాంకు ఉద్యోగుల సమ్మె మరియు గాంధీ జయంతి కారణంగా వచ్చే వారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు వరుస సెలవులు రానున్నట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా బ్రాంచ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. అలాగే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా సెలవు ఉండటంతో ప్రజలు తమ ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.